Posts

Showing posts from June, 2025
Image
జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం  మాదకద్రవ్యాల నిర్మూలనకై మెగా ర్యాలి 👉 జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంను పురస్కరించుకొని Telangana Anti Narcotics Dept. ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ పరిసరాల్లో నిర్వహించిన 2 కిలోమీటర్ల Walkathon ర్యాలీలో సంబంధిత పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, Lions Clubs International 320H జిల్లా, IMPACT Foundation నాయకులు... Ln మనోహర్ రెడ్డి, Ln గంపా నాగేశ్వరరావు, Ln నందకిషోర్, Ln భావన శ్రీనివాస్, Ln శ్రీధర్ తదితరులు పాల్గొనడం జరిగింది. ర్యాలీలో... *Say No to Drugs - Say Yes to Life *మత్తు పదార్థాలు వద్దు - జీవితం ముద్దు *Drugs - You lose more than you gain *మాదకద్రవ్యాల మాయలో పడకండి - జీవితాన్ని నాశనం చేసుకోకండి  అంటూ పలు నినాదాలతో యువతకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
Image
 ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు 👉1) హయత్ నగర్ కోర్ట్ లో...      జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవమును పురస్కరించుకొని జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ హయత్ నగర్ 14వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో వివిధ యోగాసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణాయామ ప్రక్రియలు నేర్పించడమైనది.  ఈ సందర్భంగా కోర్టు ఇంచార్జి జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి గోపిక నాగ శ్రావ్య మాట్లాడుతూ ప్రతిరోజూ ఒక్క గంట శారీరక శ్రమ ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చని, రోగాలు పాలు కాకుండా సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చని, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడులను జయించవచ్చని అన్నారు.        కార్యక్రమంలో సామాజిక కార్యకర్త గోపాల్ దాస్ రాము, కోర్ట్ సీనియర్ సూపరింటెండెంట్ ధారా రాములు, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు... మోడెమ్ ప్రభాకర్, బండి నరేష్, మేకల సతీష్, న్యాయవాదులు, పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 👉2) సచివాలయ నగర్ కమ్యూనిటీ హాల్ నందు...       Dept.of AYUSH వనస్ధలిపురం హోమియో వైద్యశాల...
Image
జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం  జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల కాలుష్యం - నియంత్రణ ఆవశ్యకతపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల నిర్వహించిన పోటీల్లో నాటికల విభాగంలో వనస్ధలిపురం జాగృతి అభ్యుదయ సంఘం గ్రీన్ సోల్జర్స్ ప్రదర్శించిన "గంగా" నాటికకు ప్రధమ, తృతీయ బహుమతులు గెలుచుకుంది.    ఈరోజు కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర కార్యాలయం సనత్ నగర్ లో నిర్వహించిన బహుమతుల పంపిణీ కార్యక్రమానికి EFS&T Minister శ్రీమతి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ అహమద్ నదీమ్ IAS, TGPCB సభ్య కార్యదర్శి రవి కుమార్ IAS, సోషల్ సైంటిస్ట్ W.G ప్రసన్నకుమార్ తదితరులు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా...    జాగృతి ఛైర్మన్ భావన శ్రీనివాస్ సంతోషం వ్యక్త పరుస్తూ పర్యావరణ పరిరక్షణకై తమ మీద మరింత బాధ్యతలు పెరిగాయని భావిస్తున్నట్లుగా అన్నారు. భావన శ్రీనివాస్ ,  ఫౌండర్ & ఛైర్మన్ - జాగృతి అభ్యుదయ సంఘం.