Posts

Showing posts from December, 2024

December 5 "World Soil Day"2024

Image
  నేలను పాడు చేసుకుంటే మీరు పంటలు ఎక్కడ పండిస్తారు ? 👉 భూదాన్ పోచంపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వేదికగా భావన శ్రీనివాస్       December 5 "World Soil Day" సందర్భంగా GHMC స్వచ్ఛభారత్ మిషన్ పిలుపు మేరకు జాగృతి అభ్యుదయ సంఘం మరొక ముందడుగు వేసింది.        'నేటి బాలలే రేపటి పౌరులు' అన్న పెద్దల మాటలను నమ్ముతూ విద్యార్ధి దశ నుండే పిల్లల్లో "నేల" ప్రాముఖ్యత/అవసరం గురించి, నేలతల్లి కాలుష్యం వల్ల తలెత్తే దుష్పరిణామాలు, పరిష్కార మార్గాల గురించి విద్యార్థులకు చెప్పి వారిని చైతన్య పరచారలనే సదాశయంతో పోచంపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల  HMగారి ఆహ్వానం మేరకు వారి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశమునకు భావన శ్రీనివాస్ హాజరైనారు.    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. *కన్న తల్లి 9నెలలు మోస్తే నేలతల్లి 90సం.లు మొయ్యాలని,  అటువంటి నేలమ్మ గర్భంలోకి వ్యవసాయం పేరుతో హానికారక కృత్రిమ ఎరువులు, విష రసాయనాలు చొప్పించడం వలన నేల సారం కోల్పోయి కొన్నాళ్ళకు చౌడు భూములుగా తయారై శాశ్వతంగా జీవాన్ని కోల్పోతుందని,  వాటి స్ధానంలో గోమయం, గోమూత్రం తదితర మిశ్రమ...

02-Dec-2024 Anti Pollution Day

Image
ప్లాస్టిక్ కవర్లలో వేడి పదార్థాలు క్యాన్సర్ కు కారణం                                                                                    సున్నా వ్యర్ధాలు మరియు ఏక ఉపయోగ ప్లాస్టిక్ నిషేధానికి మద్దతు   👉 హానికారక ప్లాస్టిక్, పేపర్ టీ గ్లాసులు వాడొద్దంటూ దుకాణదారులకు గాజు టీ గ్లాసుల పంపిణీ. స్థిరమైన మరియు పర్యావరణానుకూల జీవనశైలిని ప్రోత్సహించడంలో భాగంగా జాగృతి అభ్యుదయ సంఘం, కమలా నగర్  కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి జీరో వ్యర్థ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహించడం మరియు ఏక ఉపయోగ ప్లాస్టిక్‌ల నిషేధాన్ని అమలు చేయడంపై దృష్టి పెట్టింది.   కార్యక్రమం ముఖ్యాంశాలు:  1. జూట్ బ్యాగులు: ప్లాస్టిక్ బ్యాగులకు ప్రత్యామ్నాయ reusable మరియు పర్యావరణ అనుకూల సంచులు. 2. అకు ప్లేట్స్: విందు మరియు ఇతర సందర్భాలలో ఉపయోగించదగిన బయోడి...