మనం తినే ఆహారం సరిగా సక్రమంగా ఉంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. "ఆరోగ్యమే మహాభాగ్యం" పదం నినాదంగా మిగిలి పోకుండా ఆరోగ్యంతో అందరూ బాగుండాలి అనే తన లక్ష్యం సాధన ధ్యేయంగా హానికారక ప్లాస్టిక్ ప్లేట్ల స్ధానంలో వాటికి ప్రత్యామ్నాయంగా... మొదటిముద్ధ వ్యవస్థాపకుడు, జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ గారు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయానికి వచ్చే భక్తుల ఆరోగ్యం కోసం స్టీలు ప్లేట్లను, స్టీలు గ్లాసులను ఉచితంగా అందించారు. కృతజ్ఞతలతో... ఛైర్మన్ : శ్రీ వేముల జయరాములు, ప్రధాన కార్యదర్శి: శ్రీ అల్లాడి లక్ష్మీ నారాయణ, జాగృతి డైరెక్టర్ : శ్రీ యాదా రామలింగేశ్వరరావు, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం, సచివాలయ నగర్, వనస్థలిపురం , హైదరాబాద్ -70