తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరు కొనసాగించాలి మరియు ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టి ఆయన త్యాగాన్ని గౌరవించాలి. పొట్టి శ్రీరాములు గారి పేరును తొలగించడం అంటే మొత్తం తెలుగుజాతిని, ప్రతి తెలుగువాడిని అవమానించినట్టేనంటూ 👉 జాగృతి అభ్యుదయ సంఘం అధ్యక్షులు భావన శ్రీనివాస్ గారు మరియు ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎస్ జె ఎస్ నందకిషోర్ గారి ఆధ్వర్యంలో వనస్ధలిపురం గణేష్ కాన్ఫరెన్స్ హాల్ వేదికగా జరిగిన సమావేశంలో సభ్యులు కలిసి ప్రకటించిన తీర్మానం.. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం తోటి ఏర్పడిందని, వారు 54 రోజుల ఆమరణ నిరాహారదీక్షలు చేసి ప్రాణాలర్పించిన కారణంగా పెల్లుబికిన ప్రజా ఉద్యమం తోటి అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు వారందరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధించినదని, వారి ప్రాణ త్యాగానికి కృతజ్ఞతగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వారి విగ్రహాలు ప్రతిష్ఠించి ఇప్పటికీ 'అమరజీవి' గా కొలుస్తున్నారని, తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక నెల్లూరు లాగా కనీసం ఒక జిల్లాకైనా ఆయన పేరు పెట్టి ఆ...