*బ్రతకనిస్తే అవి మనకి బ్రతుకునిస్ధాయి* మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా.... జాగృతి అభ్యుదయ సంఘము ఆధ్వర్యంలో ఈరోజు ఎల్.బి.నగర్ గౌ.శాసన సభ్యులు డాక్టర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారిచే వారి కార్యాలయం ఆవరణలో పిచ్చుక గూళ్ళు పంపిణీ చేయడమైనది, మరియు పిచ్చుకల పెంపకం పట్ల వారి బాధ్యతను నిర్వర్తిస్తూ వారే స్వయంగా వారి కార్యాలయం ప్రాంగణంలో పిచ్చుక గూళ్ళు కట్టడంతో పాటు వాటి ఆకలి, దాహార్తిని తీర్చేందుకు గింజలు చల్లి మట్టి మూకుడులో నీళ్ళు పోయడమైనది. *మన ఆహార పంటలను ఆశించి వచ్చే చీడ పురుగులను తినేసి మనకు పరోక్షంగా ఆహారాన్ని మిగుల్చుతాయి పిచ్చుకలు, కాబట్టి పిచ్చుకలను కాపాడుకోవాల్సిన అవసరం మనిషికుంది. *జీవి వైవిద్యం ద్వారా 84 లక్షల జీవరాశులు బ్రతికేట్టుగానే జీవం పోశాడు సృష్టికర్త, భగవంతుడి సృష్టిని శాసించే/నాశనం చేసే హక్కు మనిషికి లేదు, అది తెలియక ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయిస్తూ దానిని గుప్పెట్లో పెట్టుకోవాలనే స్వార్ధపూరిత ధోరణితో తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు నేటి ఆధునిక మానవుడు. అది గ్రహించిన మేము గత దశాబ్ద కాలం పైగా "పర్యావరణ పరిరక్షణ" ప్రధాన లక్ష్యంగా పలు ఆచరణాత్మక/ అవగాహన...